Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ‘ఫైలు’ పంపమనలేదు... వివాదాన్ని త్వరగా తేల్చమన్నానంతే!: మంత్రి పీతల సుజాత

ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వివాదం నుంచి బయటపడేందుకు మరోమారు యత్నిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలోని ఓ భూ వివాదంలో తలదూర్చిన మంత్రి, సదరు భూమికి సంబంధించిన ఫైలును తనకు పంపాలని రెవెన్యూ, అటవీ శాఖలకు ఆదేశాలు జారీ చేశారన్న వార్తలతో నిన్న కలకలం రేగింది. దీంతో నేరుగా మీడియా ముందుకు వచ్చిన మంత్రి ‘‘నామవరంలోని రెండు వర్గాల మధ్య ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. వివాద పరిష్కారం కోసం రెండు వర్గాలు నా వద్దకు వచ్చాయి. దీంతో వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలని అధికారులకు సూచించాను. అంతే తప్ప, ఫైలును నా వద్దకు పంపమని ఎవరినీ ఆదేశించలేదు’’ అంటూ వివరణ ఇచ్చారు.

More Telugu News